కుంభమేళాకు వెళ్లేవారికి శుభవార్త! 50 శాతం తగ్గనున్న విమాన ఛార్జీలు! కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

Header Banner

కుంభమేళాకు వెళ్లేవారికి శుభవార్త! 50 శాతం తగ్గనున్న విమాన ఛార్జీలు! కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

  Sat Feb 01, 2025 10:00        India

మహాకుంభమేళాకు వెళ్లే భక్తులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీపికబురు చెప్పారు. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు విమాన ఛార్జీల్లో 50 శాతం తగ్గించనున్నట్టు తెలిపారు. ఈ తగ్గింపు శనివారం నుంచే అమల్లోకి వస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రకటన చేశారు. ఛార్జీలను తగ్గించాలని ఇప్పటికే విమానయాన సంస్థలకు కేంద్రం సూచించింది. ఛార్జీల తగ్గింపునకు ముందు మూడుసార్లు వాటితో సమావేశాలు నిర్వహించింది. 

 

ఇటువంటి గొప్ప కార్యక్రమం 140 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని విమానయాన సంస్థలకు గుర్తుచేసిన ప్రభుత్వం.. దాని ప్రాముఖ్యతను గుర్తుంచుకోవాలని పేర్కొంది. ఇదే సమయంలో ఛార్జీల తగ్గింపుతో విమానయాన సంస్థలకు ఆర్ధికంగా నష్టం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చింది. కాగా, ప్రయాగ్‌రాజ్‌కు ఛార్జీలను తగ్గించాలని జనవరి 23న విమానయాన సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కోరింది. డిమాండ్‌కు అనుగుణంగా ప్రయాగ్‌రాజ్‌కు అదనంగా 81 విమానాలను నడిపేందుకు డీజీసీఏ జనవరిలో అనుమతించింది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

స్పైస్‌జెట్ సహా పలు విమానయాన సంస్థలు ప్రయాగ్‌రాజ్‌కు మొత్తం 132 సర్వీసులను నడుపుతున్నాయి. కానీ, సర్వీసులతో పాటు ఛార్జీలను కూడా భారీగా పెంచేశారు. న్యూఢిల్లీ- ప్రయాగ్‌రాజ్‌ మధ్య విమాన ఛార్జీలు 21 రెట్లు మేర పెరిగాయి. ఢిల్లీ, లండన్ మధ్య విమాన ఛార్జీ రూ.24 వేలుగా ఉంటే.. అదే ప్రయాగ్‌రాజ్‌కు రూ.32 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా జనవరి 27 నుంచి 30 వరకు ఈ ధరలు చూసి ప్రయాణికులు షాకయ్యారు. ప్రయాగ్‌రాజ్‌ జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా.. ఫిబ్రవరి 26వరకు కొనసాగనుంది. 

 

మౌని అమావాస్య నేపథ్యంలో సంగం ఘాట్ల వద్ద విపరీతమైన రద్దీ కారణంగా తొక్కిసలాట చోటుచేసుకున్నప్పటికీ ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో ఇప్పటి వరకు దాదాపు 28 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగం నది ఒడ్డున 4,000 హెక్టార్లలో (9,990 ఎకరాలు) ఒక తాత్కాలిక నగరాన్ని ఏర్పాటు చేశారు. ఇది 7,500 ఫుట్‌బాల్ మైదానాలకు సమానం. భక్తులకు వసతి కల్పించడానికి 150,000 టెంట్లు, అంతే సంఖ్యలో టాయిలెట్లు ఉన్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

 

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!

  

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!

 

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్రవాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #India #Kumbhamela #Festivals